శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 26, 2020 , 10:16:04

దంపతుల ఆత్మహత్యాయత్నం : భార్య మృతి

దంపతుల ఆత్మహత్యాయత్నం : భార్య మృతి

హైదరాబాద్‌ : వనస్థలిపురం హరిహరపురం కాలనీలో విషాదం నెలకొంది. కాలనీలోని ఓ ఇంట్లో ఇద్దరు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. భార్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. భర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo