సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 18:52:25

కారు కొట్టుకుపోయింది.. మనుషులు సేఫ్‌.. వీడియో

 కారు కొట్టుకుపోయింది.. మనుషులు సేఫ్‌.. వీడియో

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చిన్న బీరవల్లి గ్రామ సమీపంలోని వాగు వరద ఉదృతి కారు కొట్టుకుపోయింది. వాగుపై బ్రిడ్జీని దాటే క్రమంలో కారు నీటిలో కొట్టుకుపోయింది. ఈ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు.. స్థానికులు వాగులోకి దూకి వారిని రక్షించారు.


రా పల్లె క్రాస్‌రోడ్‌ చిన్న బీరపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇదే సమయంలో బోనకల్లు వెళ్లేందుకు ఇండికా కారులో నలుగురు వ్యక్తులు వచ్చారు. వాగుపై బ్రిడ్జిని దాటేక్రమంలో వరద ఉదృతి పెరగడంతో కారు వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు వెంటనే వాగులోకి దూకి నలుగురికి రక్షించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.


logo