శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 17:17:19

అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు..తప్పిన ముప్పు

అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు..తప్పిన ముప్పు

ఖమ్మం : కారు డ్రైవింగ్ సరదా వారి ప్రాణాల మీదకు తెచ్చినంత పనైంది. జిల్లాలోని సత్తుపల్లి మండలం గిద్దెపూడికి చెందిన మెండితోక అమలకు భర్త రాము కారు డ్రైవింగ్ నేర్పిస్తుండగా అదుపు తప్పి కాలువలోకి దూసుకెల్లింది. కారులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు .చిన్నారులను కూడా కారులో ఎక్కించుకొని సాగర్ కాలువ పై డ్రైవింగ్ కోసం వెళ్లడంతో అది కాస్తా అదుపుతప్పి కాల్వలోకి జారింది. అయితే అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు దాన్ని గుర్తించి వెంటనే వారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది.


logo