శనివారం 11 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 14:31:47

పాడి పరిశ్రమతో ఉజ్వల భవిష్యత్తు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాడి పరిశ్రమతో ఉజ్వల భవిష్యత్తు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : గోపాల మిత్రలో జిల్లా దేశంలోనే  ప్రథమ స్థానంలో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లైవ్ స్టాక్ ఏజెన్సీలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, గతం నుంచే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ మిలితమై ఉందన్నారు. పాడి లేనిదే వ్యవసాయం లేదని అన్నారు. పాడి బాగుంటే పౌష్టికాహారం లభిస్తుందని, జబ్బులు రావని, మనిషి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రతి యాదవునికి గొర్రెలిచ్చామని, గేదెలు కూడా ఇస్తే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.


పాలకు మంచి గిరాకీ ఉందని, అందువల్ల పాడి పై దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలన్నారు. మటన్, చికెన్ కు కూడా మంచి గిరాకీ ఉందని, దీని ద్వారా కూడా పాడిపరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులను హరితహారంలో భాగస్వాములను చేసి మొక్కలు నాటించాలని, చెరువు గట్లు, పొలం గట్లు, కాలువలు అన్ని చోట్లా మొక్కలు నాటించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో గోపాల మిత్ర చైర్మన్ చెన్నకిషన్ రెడ్డి, పశు సంవర్థక శాఖ సీఈవో మంజువాణి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి మధుసూధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.logo