శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Aug 02, 2020 , 01:51:02

ఆయిల్‌పాం సాగుతో ఉజ్వల భవిష్యత్‌

ఆయిల్‌పాం సాగుతో ఉజ్వల భవిష్యత్‌

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

దమ్మపేట: ఆయిల్‌పాం సాగుకు ఉజ్వల భవిష్యత్‌ ఉన్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్‌ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో అశ్వారావుపేట, అప్పారావుపేటల్లో ఫ్యాక్టరీల విస్తరణ జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40,872 ఎకరాల్లో పామాయిల్‌ పంటఉండగా ఒక్క భద్రాద్రి జిల్లాలోనే 33,812 ఎకరాల్లో సాగవుతున్నట్లు తెలిపారు. తాను అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడలిస్ట్‌నని.. విద్య, వైద్య రంగాల్లో ఉన్నా తనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.logo