మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 17:13:34

విద్యతోనే ఉజ్వల భవిష్యత్ : ఎంపీ రంజిత్‌రెడ్డి

విద్యతోనే ఉజ్వల భవిష్యత్ : ఎంపీ రంజిత్‌రెడ్డి

వికారాబాద్ : విద్యతోనే మనిషికి ఉజ్వల భవిష్యత్. విద్య ద్వారానే సకలం సమకూరుతాయని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీ సొంత నిధులతో పేద విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలు వినడానికి ఉచితంగా టీవీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్య ఒక ఆయుధమన్నారు. విద్యతోనే మనిషి అన్ని విధాలుగా ఎదుగుతారని చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు రద్దు చేయడంతో విద్యార్థుల చదువు ప్రశ్నార్థకమైందన్నారు. 

ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి కొందరు పేద విద్యార్థులకు టీవీలు లేవనే విషయాన్ని గుర్తించి.. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీకి ఒక టీవీ అందించడానికి స్వయంగా ముందుకు వచ్చాని తెలిపారు. విద్య ప్రాధాన్యం తెలిసిన వ్యక్తిగా తోచినంతలో సాయం అందించానన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఎంపీపీ కాలె భవాని, జడ్పీటీసీ కాలె జయమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo