బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 03, 2020 , 17:13:47

పేదింటి ఆడబిడ్డలకు వరం..కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌

పేదింటి ఆడబిడ్డలకు వరం..కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌

సిద్దిపేట : దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారని..పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఓ వరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందన్నారు. అలాగే లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


logo