మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 07:17:58

5.5 కేజీల బరువుతో జన్మించిన శిశువు

5.5 కేజీల బరువుతో జన్మించిన శిశువు

నిర్మల్‌ : 5.5 కేజీల బరువుతో మగ శిశువు జన్మించిన సంఘటన నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రసూతి దవాఖానలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్‌ జిల్లాలోని సోన్‌ మండలం లెఫ్ట్‌పోచంపహాడ్‌కు చెందిన నేహ ప్రపవం కోసం ప్రసూతి దవాఖానలో చేరగా వైద్యులు రాజేందర్‌, సరోజ, మమత సాధారణ కాన్పు కోసం ప్రయత్నించారు.

వీలు కాక పోవడంతో ఆపరేషన్‌ చేయగా 5.5 కేజీల బరువుతో పండంటి మగబిడ్డ జన్మించాడు. శిశువు ఇంత బరువుతో జన్మించడం అరుదైన విషయమని వైద్యులు పేర్కొన్నారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిపారు.


logo