ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 01:23:58

తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్‌ కేసులు

  • రాష్ట్రంలో 14 వేలు దాటిన కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉన్నది. తాజాగా ఆదివారం 983 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 816 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లాలో 47 కేసులు, మంచిర్యాల 33, మేడ్చల్‌లో 29, వరంగల్‌ రూరల్‌ 19, వరంగల్‌ అర్బన్‌ 12, భద్రాద్రి కొత్తగూడెం 5, నల్లగొండ, కరీంనగర్‌, సిద్దిపేట, ఖమ్మం జిల్లాలో 3 చొప్పున, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్‌ 2 చొప్పున, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, జనగామ, మెదక్‌, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో 1 చొప్పున నమోదయ్యాయి. చికిత్స పొందుతున్నవారిలో నలుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 247కు పెరిగింది. ఆదివారం 3,227 నమూనాలను పరీక్షించగా, 2,244 మందికి నెగెటివ్‌ వచ్చింది. 

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు

వివరాలు      
ఆదివారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
 983
14,419  
డిశ్చార్జి అయినవారు
2445,172
మరణాలు
4247
చికిత్స పొందుతున్నవారు
-9,000


logo