e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home తెలంగాణ ఎడ్‌సెట్‌లో 98.53% అర్హత

ఎడ్‌సెట్‌లో 98.53% అర్హత

  • ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఉత్తీర్ణత
  • తమ్మిశెట్టి మహేందర్‌కు ఫస్ట్‌ ర్యాంకు
  • అకెనపల్లి ప్రత్యూషకు రెండో ర్యాంకు
  • ఫలితాలు విడుదలచేసిన ప్రొఫెసర్‌ లింబాద్రి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (నమస్తే తెలంగాణ): టీఎస్‌ ఎడ్‌సెట్‌లో 98.53 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎడ్‌సెట్‌లో ఇంతమంది క్వాలిఫై కావడం సెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్‌ నిర్వహించగా.. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. 33,683 (98.53%) విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది 77 శాతమే ఉత్తీర్ణులయ్యారని, 98 శాతానికిపైగా పాస్‌ కావడం ఇదే తొలిసారి అని అధికారవర్గాలు వెల్లడించాయి. పురుషులు 99.52 శాతం, మహిళలు 98.24 శాతం మంది అర్హత సాధించారు.

  • బీఈడీ కోర్సుల్లో చేరే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 42 వేలమంది ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 32 వేల మంది మహిళలే ఉండటం గమనార్హం. అర్హత సాధించినవారిలోనూ వారే అధికం.
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 100కు వందశాతం క్వాలిఫై కావడం గమనార్హం. ఎస్సీలు 4,770 మంది, ఎస్టీలు 7,868 మంది పరీక్ష రాయగా.. అంతా పాస్‌ అయ్యారు.
  • భద్రాద్రి కొత్తగూడెం, విజయవాడ కేంద్రాల్లో పరీక్షరాసిన వందశాతం మంది అర్హత సాధించారు.
  • ఇంగ్లిష్‌/ తెలుగులో 98.71%, ఇంగ్లిష్‌/ ఉర్దూలో 96.54 % చొప్పున మంది అర్హత సాధించారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement