శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 02:20:11

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
  • తొలిరోజు 95.29% మంది హాజరు
  • సెట్‌-ఏ కోడ్‌ పరీక్ష పత్రం విడుదల
  • ఆరు మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్‌ సెకండ్‌ లాంగ్వేజీ పేపర్‌-1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,80,531 మంది నమోదుచేసుకోగా 4,57,899 మంది (95.29శాతం) హాజరయ్యారు. సూర్యాపేట జిల్లాలో ఐదు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఒకటి.. మొత్తం ఆరు మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 23 వరకు పరీక్షలు కొనసాగుతాయి. 


విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు

వికారాబాద్‌లోని పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కలిశారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల పట్ల ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవద్దంటూ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. పలుచోట్ల సమయానికి రానివారిని పరీక్షకు అనుమతించలేదు.


ఒత్తిడి అధిగమించేందుకు..

విద్యార్థులు ఒత్తిడి, పరీక్షల భయాలను అధిగమించేందుకు క్లినికల్‌ సైకాలజిస్టులను అందుబాటులో తీసుకొచ్చినట్టు బోర్డు కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 5న మధ్యాహ్నం 3 గంటల నుంచి డాక్టర్‌ మజర్‌అలీ 7337225425, డాక్టర్‌ రజినీ 7337225364, జవహర్‌లాల్‌నెహ్రూ 7337225360, శ్రీలత 7337225083, శైలజ 7337225098, అనుపమ గుట్టిందీవి 7337225763 లను సంప్రదించాలి.


logo