బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 19:42:48

జలమండలిలో 93 మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

జలమండలిలో 93 మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ : జలమండలిలో 93 మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జలమండలిలోని ఇంజినీరింగ్‌ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 79, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 06, ఎలక్ట్రికల్‌ విభాగంలో 04, ఈసీఈ విభాగంలో 03, ఐటీ విభాగంలో 01 పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇతర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 


logo