గురువారం 02 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 22:50:01

తెలంగాణలో 920 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో 920 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో గరువారం 920 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 737మంది రంగారెడ్డి జిల్లాలో 86 మంది, మేడ్చల్‌ జిల్లాలో 60మంది  కరోనా బారినపడ్డారు. 24గంటల వ్యవధిలో ఐదుగురు మృతి చెందారు రాష్ట్రంలో ఇప్పటి వరకు 11364 మంది కరోనా బారినపడిన పడ్డారు.  వివిధ దవాఖాల్లో 6446మంది చికిత్స పొందున్నారు. ఇప్పటి వరకు 4688మంది డిశ్చార్జికాగా 230 మంది మృతి చెందారు. గురువారం ఒక్కరోజే దవాఖాన నుంచి 327మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.logo