శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:21:08

9 వేల కొవిఫర్‌ డోసులు

9 వేల కొవిఫర్‌ డోసులు

  • 20 లోపు రాష్ర్టానికి సరఫరా చేస్తాం: హెటిరో
  • దేశవ్యాప్తంగా 60వేల డోసుల సరఫరా

హైదరాబాద్‌: రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ వర్షన్‌ కొవిఫర్‌ ఔషధం 9 వేల డోసులను తెలంగాణకు సరఫరా చేయనున్నట్టు హెటిరో హెల్త్‌కేర్‌ సంస్థ తెలిపింది.  ఈ నెల 20వ తేదీ లోపు ఈ మందును సరఫరా చేయనున్నట్టు వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 60 వేల డోసులను సరఫరా చేయనున్నట్టు సంస్థ పేర్కొన్నది. హెటిరో 100మిల్లీగ్రాముల డోసుల రూపంలో ఔషధాన్ని సరఫరా చేస్తున్నది. ఈ 60 వేల డోసుల్లో మహారాష్ట్రకు 12,500, ఢిల్లీకి 10 వేలు పంపనున్నది. తెలంగాణకు ఇప్పటికే 14,502 డోసులను సరఫరా చేసినట్టు సంస్థ వెల్లడించింది. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి రెమ్‌డెసివిర్‌ను వాడుతున్న విషయం తెలిసిందే.


logo