శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 00:36:19

వరంగల్‌ తూర్పులో 9 స్మార్ట్‌రోడ్లు

వరంగల్‌ తూర్పులో 9 స్మార్ట్‌రోడ్లు
  • దశాబ్దాలనాటి రోడ్లకు మహర్దశ
  • రెండు రోజుల్లో పనులు ప్రారంభం

వరంగల్‌, నమస్తేతెలంగాణ: కాకతీయ వారస త్వ సంపద ఆనవాళ్లు అడుగడుగునా కనిపించే వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో తొమ్మిది స్మార్ట్‌ రోడ్లను నిర్మించనున్నారు. నిజాంకాలం నాటి రోడ్లతో ఇక్కడి పరిస్థితి అధ్వానంగా మారింది. చారిత్రక నగరం స్మార్ట్‌సిటీగా ఎంపికైన తరుణంలో అప్పుడు మేయర్‌గా ఉన్న ప్రస్తుత తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రత్యేక శ్రద్ధతో స్మార్ట్‌సిటీ మొదటి ప్యాకేజీలో ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. దీంతో పాతకాలం నాటి రోడ్లకు ఇప్పుడు మహర్దశ పట్టనున్నది. రూ.52.69 కోట్లతో  తొమ్మిది ప్రధాన రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. రెండు రోజుల్లో పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోడ్లపై ప్రత్యేకంగా సైకిల్‌ ట్రాక్‌, పాదచారులకు ఫుట్‌పాత్‌లు, లైటింగ్‌, పోర్టబుల్‌ టాయ్‌లెట్లు, వాటర్‌ ఏటీఎంలు ఏర్పాటు కానున్నాయి. 


అన్ని విధాలా అభివృద్ధి

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆశీర్వాదంతో వరంగల్‌ తూర్పు  నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఇక్కడి అన్ని ప్రధాన రహదారులను స్మార్ట్‌రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించాం. రెండుమూడు రోజుల్లో పనులను ప్రారంభిస్తాం. పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతాం.

- నన్నపునేని నరేందర్‌, తూర్పు ఎమ్మెల్యే


logo