బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 19:05:11

తొమ్మిది నెలల గర్భం... ఉదయం మాయమైంది..

తొమ్మిది నెలల గర్భం... ఉదయం మాయమైంది..

జోగులాంబ గద్వాల: జిల్లాలోని మనోపాడ్‌ మండలంలో వింత సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని పెద్దపోతుపాడు గ్రామానికి చెందిన మానస(25)కు ఆరు సంవత్సరాల క్రితం చిన్నపోతుపాడుకు చెందిన వెంకటేశ్‌తో వివాహమైంది. గత ఏడాది మానస నెల తప్పినట్లు తెలుసుకుంది. నాలుగు నెలల గర్భవతి అప్పటి నుంచి స్థానిక ఆశావర్కర్‌ సహాయంతో మనోపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలసరి పరీక్షలు చేయించుకుంటుంది. ఈ నెలలో ఆమెకు 9 నెలలు నిండాయి. నిన్న రాత్రి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తనకు దేవుడు పూనాడని గట్టిగా కేకలు వేస్తూ వైద్యసేవలకు నిరాకరించింది మానస. తాను ఇంటికి వెళతానని పట్టుబట్టడంతో ఆటోలో ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన ఆమె నిద్రపోయింది. 

ఉదయం లేచి చూసేసరికి ఆమె కడుపు ఖాళీగా ఉంది. మానస మాత్రం దేవుడు వచ్చి నా బిడ్డను తీసుకెళ్లాడని చెబుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న  పీహెచ్‌సీ వైద్యరాలు దివ్య ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టింది. గత ఏడు నెలల క్రితం ఆమె కడుపుతో ఉన్నప్పుడు తానే పరీక్షించినట్లు డాక్టర్‌ తెలిపారు. ఇప్పుడు మాత్రం ఆమె డెలివరి అయినట్లు, అబార్షన్‌ అయినట్లు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. స్కానింగ్‌ చేస్తేగాని వాస్తవాలు తెలియవన్నారు. దేవుడు ఆవహించాడు అనే విషయం అవాస్తవం. స్కానింగ్‌ రిపోర్టును బట్టి నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆమె వెంట వచ్చిన ఆశా వర్కర్లు మాత్రం నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకొచ్చామని తెలిపారు. ఆమె కడుపు ఎలా ఖాళీ అయ్యిందో అర్థం కావడం లేదన్నారు. మానస తల్లిదండ్రులు, భర్త కూడా అదే విషయం చెబుతున్నారు.  


logo