శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 18:25:26

9 నెల‌ల చిన్నారికి క‌రోనా పాజిటివ్

9 నెల‌ల చిన్నారికి క‌రోనా పాజిటివ్

కుమ్రంభీం ఆసిఫాబాద్ : తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండవం చేస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి రాష్ర్ట ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మైపోతున్నాయి.

తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్ న‌గ‌ర్ మండ‌లంలోని ఈస‌గావ్ గ్రామంలో క‌రోనా వైర‌స్ క‌ల‌వ‌రం సృష్టించింది. ఓ తొమ్మిదేళ్ల చిన్నారికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. ఆమె కుటుంబ స‌భ్యుల‌తో పాటు స్థానికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. చికిత్స నిమిత్తం చిన్నారిని హైద‌రాబాద్ లోని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు జిల్లా మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ కే బాలు తెలిపారు. 

చిన్నారి త‌ల్లిదండ్రులు ఢిల్లీ నుంచి ఇటీవ‌లే ఈసగావ్ కు వచ్చారు. దంప‌తులిద్ద‌రికి ఇటీవ‌లే క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో వీరు ఎవ‌రెవ‌రితో స‌న్నిహితంగా  ఉన్నారు అనే అంశాల‌పై వైద్యాధికారులు, పోలీసులు దృష్టి సారించారు.  

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 26 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వీరిలో 22 మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిలో అత్య‌ధికులు వ‌ల‌స కూలీలే ఉన్నార‌ని అధికారులు తెలిపారు. logo