శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:49

తాజా కేసులు 1,550

తాజా కేసులు 1,550

  • జీహెచ్‌ఎంసీలో 926 మందికి పాజిటివ్‌
  • 9 మంది మృతి, 1,197 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సోమవారం 1,550 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 926 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రంగారెడ్డిలో 212, కరీంనగర్‌లో 86, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 53, నల్లగొండలో 41, ఖమ్మం 38, కామారెడ్డి 33, సంగారెడ్డి 19, వరంగల్‌ అర్బన్‌లో 16, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌లో 13, సూర్యాపేట, సిద్దిపేట, జనగామ, భద్రాద్రి కొత్తగూడెంలో 10 , వరంగల్‌ రూరల్‌, ని జామాబాద్‌లో 8, రా జన్న సిరిసిల్ల జిల్లా లో 7, పెద్దపల్లి, మెదక్‌, జయశంకర్‌ భూపాలపల్లిలో 6, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరిలో 5, వికారాబాద్‌ 3, నాగర్‌కర్నూల్‌ 2, వనపర్తి, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో ఒకకేసు చొప్పున న మోదయ్యాయి. 9మంది మృతిచెందగా.. మొత్తం మృతులు 365కు పెరిగారు. 

శ్రీశైలం దేవస్థానం దవాఖానలో 13 కేసులు

శ్రీశైలం: ఏపీలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో  సోమవారం ఒక్కరోజే 13 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశాలలో ఒక డాక్టర్‌, ఇద్దరు డ్రైవర్లు, ఒక అసిస్టెంట్‌తోపాటు డ్రైవర్‌ భార్య, మరో ఎనిమిదిమందికి కరోనా సోకింది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
సోమవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,550
36,221  
డిశ్చార్జి అయినవారు
1,197
23,679
మరణాలు
9365
చికిత్స పొందుతున్నవారు
-12,178 


logo