మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 21:00:48

తెలంగాణలో కొత్తగా 891 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 891 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో బుధవారం 891 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 719 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,444 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఐదుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 225కు చేరింది. ఇవాళ 137 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 4361 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 5858 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

బుధవారం 4063 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 67,318 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. బుధవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 719, రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ జిల్లాలో 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 6, ఖమ్మంలో 4, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ గ్రామీణ జిల్లాలో ౩ చొప్పున, సంగారెడ్డి, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో రెండు చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.


logo