మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 21:38:22

రాష్ట్రంలో కొత్తగా 872 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 872 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో సోమవారం 872 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 713 నమోదయ్యాయి. ఇప్పటి వరకు 8674 మందికి పాజిటివ్‌ నిర్ధారణవగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఏడుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 217కు చేరింది. ఇవాళ 274 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 4005 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 4452 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం 3189 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, మొత్తం 60,243 టెస్టులు చేసినట్లు పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 713, రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్‌ రూరల్‌ జిల్లా 6, మంచిర్యాలలో 5, కామారెడ్డి ౩, మెదక్‌ జిల్లాలో ౩, జనగామ, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాలో 2 చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.


logo