శనివారం 11 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 22:12:22

తెలంగాణలో కొత్తగా 87 పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 87 పాజిటివ్‌ కేసులు నమోదు

హైదరాబాద్‌ : తెలంగాణలో మంగళవారం మొత్తం 87 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కాగా మరో 12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 99. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో7, మేడ్చల్‌లో 3, నల్లగొండలో 2, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి. 

ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. 1273 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్‌ నుంచి 1526 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2891. ఇందులో వలస కార్మికులు 446 మంది ఉన్నారు. 


logo