గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 21:27:31

మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డి కేసు..మ‌రో 8 మంది అరెస్ట్

మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డి కేసు..మ‌రో 8 మంది అరెస్ట్

హైద‌రాబాద్ : మాజీ  ఏసీపీ న‌ర్సింహారెడ్డి కేసులో మ‌రో కొత్త కోణం వెలుగుచూసింది. మాదాపూర్ లో 2 వేల గ‌జాల స్థ‌లం వివాదంలో న‌ర‌సింహారెడ్డి జోక్యం చేసుకున్న‌ట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. న‌కిలీ ప‌త్రాలు సృష్టించిన న‌లుగురు, స్థ‌లాలు కొన్న మ‌రో న‌లుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల‌ను రిమాండ్ కు త‌ర‌లించారు.  న‌ర‌సింహారెడ్డి బినామి పేర్ల‌తో మాదాపూర్ లోని భూమిని ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తోంది. మార్కెట్ విలువ ప్ర‌కారం భూమి విలువ రూ.50 కోట్లుంద‌ని ఏసీబీ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. 

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు ఇప్ప‌టికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న‌ర‌సింహారెడ్డికి మార్కెట్ విలువ ప్ర‌కారం రూ.75 కోట్ల అక్ర‌మాస్తులున్న‌ట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo