మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:52:57

8 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

8 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

  • ఇందులో ఏడు ఏకగ్రీవం.. సభ నేటికి వాయిదా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎనిమిది కీలక బిల్లులకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఏడు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లులు ఆమోదం పొందిన తరువాత స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సభను మంగళవారం ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు. ఆమోదం పొందిన బిల్లులు.. 1.తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్టం-2018 సవ రణ ఆర్డినెన్స్‌ బిల్లు-2020 (ఏకగ్రీవం). 2. తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఆర్డినెన్స్‌ బిల్లు-2020 (ఏకగ్రీవం). 3. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు పెంపు, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు-2020 (ఏకగ్రీవం). 4. తెలంగాణ ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ సవరణ బిల్లు- 2020. 5. తెలంగాణ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రెండో సవరణ బిల్లు (ఏకగ్రీవం). 6. టీఎస్‌ బీపాస్‌ బిల్లు (ఏకగ్రీవం). 7. తెలంగాణ సివిల్‌          కోర్టు చట్టం  1972 సవరణ బిల్లు (ఏకగ్రీవం). 8. తెలంగాణ కోర్టు ఫీజు, వ్యాజ్యాల మదింపు చట్టం- 1956 సవరణ బిల్లు      (ఏకగ్రీవం).


logo