గురువారం 28 మే 2020
Telangana - May 11, 2020 , 21:28:02

తెలంగాణలో కొత్తగా 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

హైదరాబాద్‌ : తెలంగాణలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. 11వ తేదీన నమోదైన కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అని అధికారులు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,275కు చేరింది. ఈ వైరస్‌ నుంచి కోలుకుని సోమవారం రోజు 50 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 444. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 801. 


logo