బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 17:28:29

దుబ్బాకలో 4 గంట‌ల వ‌ర‌కు 78.12% శాతం పోలింగ్‌న‌మోదు

దుబ్బాకలో 4 గంట‌ల వ‌ర‌కు 78.12% శాతం పోలింగ్‌న‌మోదు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ మ‌రికాసేప‌ట్లో ముగియ‌నుంది. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు దుబ్బాక‌లో 78.12 శాతం పోలింగ్ న‌మోదైంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సాధార‌ణ ఓట‌ర్ల‌కు ఓటేసేందుకు అవ‌కాశం ఇచ్చారు. 5 నుంచి 6 గంట‌ల మ‌ధ్య కొవిడ్ బాధితుల‌కు ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పించారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు కేవ‌లం కొవిడ్ రోగుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. కొవిడ్ రోగులంతా పీపీఈ కిట్లు ధ‌రించారు. చేతుల‌కు గ్లౌసులు ధ‌రించి ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఉప ఎన్నిక బ‌రిలో మొత్తం 23 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. అభ్య‌ర్థుల భ‌వితవ్యాన్ని ఓట‌ర్లు ఈవీఎంల‌లో నిక్షిప్తం చేశారు. ఈ నెల 10న ఉప ఎన్నిక ఫ‌లితం వెల్ల‌డి కానుంది.