సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 26, 2021 , 13:26:53

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గణతంత్ర వేడుకలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గణతంత్ర వేడుకలు

మహబూబ్‌నగర్‌ :   ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లావ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోలీసు బలగాల కవాతు ఆకట్టుకుంది. వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమర యోధులు, సీనియర్ సిటిజన్లు, పుర ప్రముఖులు, ప్రజలు, యువత, విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 21 మంది పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలను అందజేశారు.


నారాయణ్‌ పేట్‌లో..

నారాయణపేట జిల్లా కేంద్రంలో రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్‌లో కలెక్టర్ దాసరి హరిచందన జాతీయ జెండా ఎగురవేశారు. ఎస్పీ చేతన, జిల్లా అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర సమర యోధులు తదితరులు పాల్గొన్నారు. 


నాగర్‌కర్నూల్‌లో.. 

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ శర్మన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. జడ్పీ చైర్మన్ పద్మావతి, ఎస్పీ సాయిశేఖర్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, వివిధశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

VIDEOS

logo