శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 15:51:06

దుబ్బాక ఉపఎన్నిక.. 3 గంట‌ల వ‌ర‌కు 71.10% పోలింగ్ న‌మోదు

దుబ్బాక ఉపఎన్నిక.. 3 గంట‌ల వ‌ర‌కు 71.10% పోలింగ్ న‌మోదు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు 71.10 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సాధార‌ణ ఓట‌ర్ల‌కు ఓటేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. చివ‌రి గంట‌లో మాత్రం కేవ‌లం కొవిడ్ బాధితుల‌కు ఓటేసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. 

ప‌లు పోలింగ్ కేంద్రాల‌ను ఎన్నిక‌ల అధికారులు ప‌రిశీలించి.. ఓటింగ్ స‌ర‌ళిని అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నిక నేప‌థ్యంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వ‌ద్ద  కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స‌మ‌స్యాత్మ‌క‌మైన 85 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 23 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ఫ‌లితం 10వ తేదీన తేల‌నుంది.