శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:33:13

దొంగజేబులో 71 గ్రాముల బంగారం

దొంగజేబులో 71 గ్రాముల బంగారం

శంషాబాద్‌ రూరల్‌: దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ విమాన ప్రయాణికుడు వేసుకున్న జీన్స్‌ ప్యాంట్‌ లోపలి భాగంలో ప్రత్యేకంగా కుట్టిన జేబులో 71.47 గ్రాముల బంగారం లభించింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారం తీసుకొస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు గురువారం తనిఖీలుచేపట్టారు. బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేశారు. బంగారం విలువ రూ.3,76,570 ఉంటుందని అధికారులు తెలిపారు.