గురువారం 02 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 01:02:47

ఎంత పే..ద్ద మెరుపు!

ఎంత పే..ద్ద మెరుపు!

జెనీవా: వర్షం పడే సమయంలో ఆకాశంలో మిరుమిట్లుగొలిపే మెరుపులు కనువిందు చేయడం సహజమే. అయితే బ్రెజిల్‌, అర్జెంటినాలో గతేడాది ఏర్పడిన రెండు మెరుపులు ప్రత్యేకంగా నిలిచాయి. 2019, అక్టోబర్‌ 31వ తేదీన దక్షిణ బ్రెజిల్‌లో ఏర్పడిన ఓ మెరుపు పొడవు ఏకంగా 700 కిలోమీటర్లకుపైగా ఉన్నది. గతంలో ఏర్పడిన భారీ మెరుపుల సైజుతో పోలిస్తే ఇది రెట్టింపు పొడవని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) నిపుణులు తెలిపారు. మరోవైపు, గతేడాది మార్చి 4న ఉత్తర అర్జెంటీనాలో ఏర్పడిన ఓ మెరుపు గరిష్ఠంగా 16.73 సెకండ్లపాటు ఆకాశంలో కనువిందు చేసిందని డబ్ల్యూఎంవో ప్రకటించింది. ఇది కూడా రికార్డేనని వెల్లడించింది. 


logo