మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 14:17:12

నేడు స్వస్థలాలకు 70 వేల మంది వలస కార్మికులు

నేడు స్వస్థలాలకు 70 వేల మంది వలస కార్మికులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వేల మంది వలస కార్మికులు ఈ రోజు వారి స్వస్థలాలకు తరలివెళ్లనున్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 41 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో సుమారు 70 వేల మంది వలస కార్మికులు జార్ఖండ్‌, ఒడిశా, బీహార్‌, ఉత్తరాఖండ్‌కు తరలివెళ్లనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు నాంపల్లి, ఘట్‌కేసర్‌, లింగంపల్లి, సికింద్రాబాద్‌, కాచీగూడా రైల్వే స్టేషన్ల నుంచి ప్రారంభం కానున్నాయి. భౌతిక దూరం, మాస్కులు, శానిటేషన్‌, థర్మల్‌స్క్రీనింగ్‌ వంటి జాగ్రత్తలు తీసుకుంటామని దక్షిణమధ్యరైల్వే అధికారులు వెల్లడించారు.

లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. వారికోసం కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1 నుంచి శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతున్నది. ఇప్పటివరకు వేల సంఖ్యలో వలస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వారి స్వస్థలాలకు తరలించింది.


logo