గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Feb 17, 2020 , 09:29:43

మార్గదర్శికి పచ్చతోరణం

మార్గదర్శికి పచ్చతోరణం
  • ముఖ్యమంత్రికి 66వ పుట్టినరోజు శుభాకాంక్షలు

మళ్లీ.. మళ్లీ.. ఆయన గురించి చెప్పేదేముంది? ఆయనెవరో తెలంగాణలోనే కాదు.. దేశమంతా అణువణువునా ఎవరిని కదిలించినా టక్కున చెప్పే పేరే.. ఆ పేరు గురించి ఇంకా తెలుసుకోవలసిందేముంది? ఎంతో.. ఉంది. ఎంత తెలిసినా.. తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఆయన పరిపాలనలో ప్రతి ఉదయమూ కొత్త చివురు చిగురిస్తుంది. కొత్త పరిమళం గుబాళిస్తుంది. ప్రతిమాట కొత్త ప్రతిస్పందనను కలిగిస్తుంది. రక్తపుబొట్టు చిందకుండా లక్ష్యం చేరిన ఉద్యమానికి నిర్వచనం.. సుపరిపాలనలో పాలకులకు రోల్‌ మోడల్‌.. అచ్చమైన లౌకికవాదానికి నిలువెత్తు సంతకం.. నిన్నటి తెలంగాణ చరిత్రకు కథానాయకుడు.. వర్తమాన తెలంగాణ చరిత్రకు సృష్టికర్త.. భావి తెలంగాణ చరిత్రకు మార్గదర్శి... ఒకే ఒక్కడు.. తెలంగాణ నిగళాలను తెగగొట్టిన ఏకవీరుడు. 


తెలంగాణ జనుల నాలుకలపై నడయాడే మూడక్షరాల మంత్రం.. కేసీఆర్‌. ఆయన సంకల్ప మాత్రంచేతనే గోదారమ్మ దారి మళ్లించుకొని పీఠభూమిని ముద్దాడింది. ఆయన ఇచ్చిన ఒక్క భరోసా అన్నదాతలకు కొత్త ఊపిరులూదింది. ఎండి ఎడారిగా మారిన భూములు పచ్చదనం పరుచుకొని  పరవశించిపోయాయి. ఆయన దార్శనికత తెలంగాణ రాష్ర్టాన్ని భారతదేశ యవనికపై తలమానికంగా నిలిపింది. భారతదేశంలో అత్యంత అరుదైన నాయకుడు.. సుపరిపాలకుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 66వ జన్మదినం జరుపుకుంటున్న శుభదినమిది. తెలంగాణకు పచ్చని పండుగరోజు. యావత్‌ తెలంగాణ సమాజం ఈ పర్వదినాన కోటి మొక్కలకు జీవం పోసి తన నాయకుడికి హరితతెలంగాణను కానుకగా సమర్పిస్తున్నది.


logo
>>>>>>