ఆదివారం 12 జూలై 2020
Telangana - May 28, 2020 , 21:15:50

తెలంగాణలో కొత్తగా 66 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 66 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1908 కి చేరింది. రాష్ర్టానికి వలస వచ్చిన వారిలో ఈ రోజు కొత్తగా 51 కేసులు నమోదయ్యాయి. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 49 మందికి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి రాష్ర్టానికి వచ్చిన వారిలో మొత్తం 348 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకి చికిత్స తీసుకుని మెరుగుపడి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1345 మంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 67. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 844. 


logo