ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 02:32:09

63 శాతం ప్రభుత్వ వైద్యసిబ్బందికి టీకా

63 శాతం ప్రభుత్వ వైద్యసిబ్బందికి టీకా

  • వ్యాక్సిన్‌కు 70 వేల మంది విముఖత
  • 189 మందిలో దుష్ప్రభావాలు, ఒకరి మృతి

హైదరాబాద్‌, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కరోనా టీకా వేసుకొనేందుకు 63 శాతం ప్రభుత్వ వైద్యసిబ్బంది మాత్రమే సుముఖత చూపారు. మొత్తం 1.71 లక్షల మంది ఉండగా, 1.09 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు టీకా వేసుకున్నారు. ఈ నెల 16 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువ మంది కొవిషీల్డ్‌ టీకాలు వేసుకోగా, సోమవారం ప్రారంభమైన భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను సైతం వేసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. టీకాలు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ, ప్రజ ల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. టీకా వేసుకున్నవారిలో ఇప్పటివరకు 189 మందిలో స్వల్పస్థాయి దుష్ప్రభావాలు గుర్తించినట్టు వెల్లడించారు. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 32, జయశంకర్‌ భూపాలపల్లిలో 29, సిద్దిపేటలో 22, నిర్మల్‌లో 19, సూర్యాపేటలో 14, కరీంనగర్‌లో 7, భద్రాద్రి కొత్తగూడెంలో ఆరుగురిని గుర్తించినట్టు తెలిపారు. వీరందరికీ అవసరమైన చికిత్స అందించడంతో భయాందోళనలు తొలగించేందుకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు చెప్పారు. నిర్మల్‌ జిల్లాలో టీకా తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి మరణించినట్టు గుర్తించామని, పూర్తిస్థాయి కారణాలు తెలిసేందుకు సమయం పడుతుందని వివరించారు.

VIDEOS

logo