గురువారం 28 మే 2020
Telangana - May 22, 2020 , 21:25:43

తెలంగాణలో కొత్తగా 62 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 62 కరోనా కేసులు

ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మెత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1761 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 42 జీహెచ్‌ఎమ్‌సీలోనే నమోదయ్యాయి. మిగిలిన 20 కేసులలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిలో 19, రంగారెడ్డి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.  ఈ రోజు కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకుని తిరిగి కరోనా నెగెటివ్‌ వచ్చి డిశ్చార్జ్‌ అయిన వారు 7 మంది ఉన్నారు. దీంతో మొత్తం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 670 గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నయం అయి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్ళిన వారి సంఖ్య 1043 మందిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మొత్తం 48 మంది. మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 118.logo