శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 02:01:10

సీఎంఆర్‌ఎఫ్‌కు 62 లక్షల విరాళం

సీఎంఆర్‌ఎఫ్‌కు 62 లక్షల విరాళం

  • ముఖ్యమంత్రికి అందజేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య
  • రైస్‌ మిల్లర్లు, క్రషర్లు, కెమికల్‌ ఫ్యాక్టరీల చేయూత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా కోదాడ నియోజకవర్గానికి చెందిన రైస్‌మిల్లర్లు, క్రషర్లు, కెమికల్‌ ఫ్యాక్టరీ యజమానులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.62 లక్షలు విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అందించారు.


logo