బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 01:37:26

86,095 మంది రికవరీ

86,095 మంది రికవరీ

  • ఒక్కరోజే 60 వేల టెస్టులు.. 2,795 మందికి పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం 60 వేల పరీక్షలు నిర్వహించారు., ఇప్పటివరకు మొత్తం టెస్టుల సంఖ్య 11.42 లక్షలకు చేరుకున్నది. ఇప్పటివరకు 1.14 లక్షల మందికి కరోనా సోకగా, 86,095 మంది కోలుకున్నారు. 27,600 మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.84 శాతం ఉండగా, తెలంగాణలో 0.68 శాతంగా ఉన్నది. బుధవారం ఒక్కరోజే 2,795 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని గురువారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. జీహెచ్‌ఎంసీలోనే 449 కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో 268, నల్లగొండలో 164, ఖమ్మంలో 152, కరీంనగర్‌లో 136, వరంగల్‌అర్బన్‌లో 132, మేడ్చల్‌మల్కాజిగిరి, సిద్దిపేటలో 113 చొప్పున, నిజామాబాద్‌లో 112, మంచిర్యాలలో 106, మహబూబాబాద్‌లో 102, జగిత్యాలలో 89, సూర్యాపేటలో 86, పెద్దపల్లిలో 77, భద్రాద్రికొత్తగూడెంలో 72, వనపర్తి, కామారెడ్డిలో 55 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 45, జనగామలో 42, మెదక్‌లో 41, నాగర్‌కర్నూల్‌లో 40, యాదాద్రి భువనగిరిలో 39, వరంగల్‌రూరల్‌, సంగారెడ్డిలలో 34 చొప్పున, రాజన్నసిరిసిల్లలో 32, జోగుళాంబగద్వాల, ఆదిలాబాద్‌లో 31 చొప్పున, వికారాబాద్‌లో 27, ములుగు, జయశంకర్‌భూపాలపల్లిలలో 26 చొప్పున, నిర్మల్‌లో 25, నారాయపేటలో 24, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 17 కేసులు రికార్డయ్యాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 8 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 788కి చేరుకున్నది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
బుధవారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
2,795
1,14,483
డిశ్చార్జి
87286,095
మరణాలు
08788
చికిత్సలో  ఉన్నది
-27,600


logo