e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home Top Slides లే అవుట్లలో 60 గజాల ప్లాట్లు

లే అవుట్లలో 60 గజాల ప్లాట్లు

లే అవుట్లలో 60 గజాల ప్లాట్లు
  • అనుమతులకు కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ
  • టీఎస్‌బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతులు
  • నిబంధనలు మారుస్తూ ఉత్తర్వులు జారీ
  • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు వర్తించదు

హైదరాబాద్‌, జూలై 12 ( నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నెలకొల్పే లేఅవుట్లలో ఇకపై 60 గజాల ప్లాట్లు కూడా ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు మున్సిపల్‌ చట్టం, టీఎస్‌బీపాస్‌ నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లే అవుట్లలో ప్లాట్లను పేద, మధ్య తరగతి వర్గాల వారుకూడా కొనుగోలు చేసేందుకు అనువుగా ఈ మార్పులు చేశారు. ఈ మార్పులు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని లేఅవుట్లకు వర్తించవు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఒక ప్లాటు కనీసం 120 చదరపు మీటర్లు (143 గజాలు) ఉండాలి. సవరించిన నిబంధనల ప్రకారం ఒక ప్లాటు కనీసం 50 చదరపు మీటర్లు (60 గజాలు) ఉండాలి. ఇకపై అన్ని లేఅవుట్లకు అన్‌లైన్‌లో అనుమతులు ఇవ్వనున్నారు. లేఅవుట్‌ 50 ఎకరాల కన్నా ఎక్కువగా ఉంటే.. అందులో 2500 జనాభాకు ఒకటి చొప్పున నర్సరీ స్కూల్‌ను 0.08 హెక్టార్ల విస్తీర్ణంలో, 5వేల జనాభాకు ఒకటి చొప్పున ప్రైమరీ స్కూల్‌ 0.4 నుంచి 0.6 హెక్టార్ల స్థలంలో ఉండాలి. 60 గజాల ప్లాట్లు వేసే లేఅవుట్‌కు తప్పనిసరిగా 60అడుగుల (18మీటర్లు) అప్రోచ్‌ రోడ్‌ ఉండాలి. లే అవుట్‌లో 10 శాతం ఖాళీ స్థలాన్ని వదలాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ స్థలాన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పేరు మీదు రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఇందులో 9 శాతం గ్రీన్‌ స్పేస్‌, లంగ్‌ స్పేస్‌, మొక్కల పెంపకానికి విని యోగించాలి. మిగిలిన ఒక శాతాన్ని ప్రజల కనీస అవసరాలైన తాగునీటి ట్యాంకు నిర్మాణానికి, సెప్టిక్‌ ట్యాంకు, ఎస్టీపీ, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, కామన్‌ పార్కింగ్‌ ఏరియా వంటి వాటికి వినియోగించాలి. లేఅవుట్‌లో ప్రతి చదరపు మీటర్‌కు రెండు రూపాయల చొప్పున యూజర్‌ ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని మార్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. 2.5 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు కేటాయించాలి. ఈ స్థలంలో స్కూల్‌, క్లినిక్‌, ప్లే స్కూల్‌, డిస్పెన్సరీ, ఫార్మసీ, ఇతర షాపులను ఏర్పాటు చేసుకోవడానికి వినియోగించాలి.

జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ
లేఅవుట్ల మంజూరుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లాస్థాయి లేఅవుట్‌ అప్రూవల్‌ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీకి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కన్వీనర్‌గా ఉంటారు. సభ్యులుగా ఆర్‌ అండ్‌ బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ ఎస్‌ఈలు ఉంటారు. వీరితోపాటు కలెక్టర్‌ నామినెట్‌ చేసే అధికారి, జిల్లా టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారి సభ్యులుగా ఉంటారు. దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో అధికారుల బృందం తనిఖీ చేసి అనుమతులు ఇస్తారు. లేఅవుట్‌ డెవలపర్‌, యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నట్లు ఉత్తర్వుల్లో హెచ్చరించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లే అవుట్లలో 60 గజాల ప్లాట్లు
లే అవుట్లలో 60 గజాల ప్లాట్లు
లే అవుట్లలో 60 గజాల ప్లాట్లు

ట్రెండింగ్‌

Advertisement