శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Feb 23, 2021 , 14:36:03

రేపటి నుంచి 6,7, 8 తరగతులు ప్రారంభం

రేపటి నుంచి  6,7, 8 తరగతులు ప్రారంభం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో 6,7,8 తరగతుల విద్యార్థులకు రేపటి నుంచి బడులు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ఈ మేరకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మార్చి 1వ తేదీలోగా తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులు కొవిడ్‌ మార్గదర్శకాలు విధిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని ఆమె పేర్కొన్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo