ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 20:07:38

6.64 లక్షల వరద బాధితులకు సాయం అందింది : పురపాలకశాఖ

6.64 లక్షల వరద బాధితులకు సాయం అందింది : పురపాలకశాఖ

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరదల కారణంగా నష్టపోయిన వారిలో ఇప్పటివరకు 6.64 లక్షల మంది బాధితులకు రూ. 664 కోట్ల ఆర్థిక సాయం అందించామని పురపాలకశాఖ తెలిపింది. గత మూడు రోజుల్లో మీ సేవా కేంద్రాల ద్వారా 2.86 లక్షల కుటుంబాలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయని వెల్లడించింది. వీరిలో 1.78 లక్షల కుటుంబాలకు రూ.178 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది.

ఎన్నికల అనంతరం ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందేలా చూస్తామని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందకుండా బీజేపీ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో సాయం నిలిపివేయాలంటూ ఎలక్షన్‌ కమిషన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి విదితమే. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.