మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 00:18:28

ఎదురెక్కుతున్న గోదావరి

ఎదురెక్కుతున్న గోదావరి

-కాళేశ్వరం లింక్‌-1,2లో దిగ్విజయంగా ఎత్తిపోతలు 

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: గోదావరి దిగ్విజయ యాత్ర కొనసాగుతున్న ది. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసేందుకు వం దల కిలోమీటర్లు ఎదురెక్కుతూ లక్ష్యాన్ని ముద్దాడుతున్నది. లింక్‌-1, 2లో మోటర్లు దిగ్విజయంగా నడుస్తుండగా జలాల ఎత్తిపోత లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. దిగువన భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్‌హౌజ్‌లో రెండోనంబర్‌ మోటర్‌ నడుస్తుండ గా, శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మం డలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌజ్‌లో రెండో నంబర్‌ మోటర్‌ ద్వారా 2,900 క్యూసెక్కుల నీరు మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్‌లోకి పంపిస్తున్నారు. పార్వతి బరాజ్‌ నుంచి 2,610 క్యూసెక్కుల నీటిని అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతి పంప్‌హౌజ్‌ ద్వారా ఎగువన ఎల్లంపల్లి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. లింక్‌-2లో భాగంగా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌజ్‌లో 2, 3వ మోటర్లు నడుస్తుండగా, సాయంత్రం గంటపాటు ఐదో మోటర్‌ను నడిపి నిలిపివేశారు. ప్రస్తుతం ఒక్కోమోటర్‌ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి పంపుతున్నారు. ఇక్కడి నుంచి ఏడోప్యాకేజీలోని జంట సొరంగాల ద్వారా ఎనిమిదో ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌజ్‌కు తరలుతున్నాయి. ఇక్కడ 2, 4వ పంపులు 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, వరద కాలువ ద్వారా ఎస్సారార్‌ జలాశయానికి చేరుతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి గాయత్రి పంప్‌హౌజ్‌ ద్వారా 2,136 టీఎంసీల నీటిని ఎస్సారార్‌కు తరలించినట్టు అధికారులు చెప్పారు. 

ఎల్‌ఎండీకి 6,285వేల క్యూసెక్కులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి శనివారం ఎల్‌ఎండీకి 6,285 క్యూసెక్కుల నీటిని తరలించారు. ఎస్సారార్‌ 14, 15, 16వ నంబర్ల గేట్లతోపాటు ఒక రివర్స్‌ స్లూయీస్‌ గేటు ద్వారా ఎల్‌ఎండీకి నీటిని వదులుతున్నట్టు ఎస్‌ఈ శ్రీకాంతారావు తెలిపారు. ఎస్సారార్‌ జలాశయంలో 24.708 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. ప్రస్తుతం ఎల్‌ఎండీలో 8.044 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ఆయన  పేర్కొన్నారు.


logo
>>>>>>