గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 13:58:00

సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ

సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. పోలీసు శాఖ ఆధునీకరణకు, శిక్షణకు, వారి జీవన ప్రమాణాల పెంపుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు, వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసిందన్నారు మంత్రి. ఈ చర్యలతో పోలీసు శాఖ పనితీరు ఎంతో మెరుగుపడింది. ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కర్ఫ్యూలు, కల్లోలాలు లేకుండా జనజీవనం ప్రశాంతంగా సాగుతున్నదని మంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ నగరంలో చేపట్టిన పోలీసు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం త్వరలోనే పూర్తి కానున్నదని తెలిపారు. గుడుంబా రక్కసిని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని చెప్పారు. ఈ బడ్జెట్‌లో పోలీసు శాఖకు రూ. 5,852 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.


logo
>>>>>>