ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 20:30:17

రెండోరోజు 580 నామినేషన్లు దాఖలు

రెండోరోజు 580 నామినేషన్లు దాఖలు

హైదరాబాద్ :  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రెండోరోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. గురువారం 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు వేశారు.  బీజేపీ నుంచి 140 మంది, సీపీఐ నుంచి ఒకరు, సీపీఐ(ఎం) నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి 68, ఎంఐఎం నుంచి 27, టీఆర్ఎస్ నుంచి 195 మంది, టీడీపీ నుంచి 4, వైఎస్సార్సీపీ ఒకరు, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 15 మంది, స్వతంత్రులుగా 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.

21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 24న ఉప సంహరణతోపాటు తుది బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుండగా.. డిసెంబర్‌ 3న అసరమైన చోట రీపోలింగ్‌, 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.