శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 07:55:07

కమర్షియల్‌ కోర్టులకు 58 పోస్టులు మంజూరు

కమర్షియల్‌ కోర్టులకు 58 పోస్టులు మంజూరు

మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఆర్థికశాఖ

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న రెండు కమర్షియల్‌ కోర్టులకు 58 పోస్టులను మంజూరుచేస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈవోడీబీ సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లో రెండు కమర్షియల్‌ కోర్టులను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో కోర్టుకు 29 పోస్టులను మంజూరుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారపరమైన లావాదేవీలకు సంబంధించిన వివాదాలను ఈ రెండు కోర్టులు పరిష్కరించనున్నాయి. ఈ రెండు కోర్టులకు జిల్లాస్థాయి జడ్జి హోదా ఇచ్చారు. రెండింటికీ కలిపి ఇద్దరు జిల్లా జడ్జీలు, సూపరిటెండెంట్‌, పది మంది జూనియర్‌ అసిస్టెంట్లు, నలుగురు టైపిస్టులు, ఫిల్డ్‌ అసిస్టెంట్లు, ప్రాసెస్‌ సర్వర్‌, పది మంది అటెండర్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఇద్దరు ఎగ్జామినర్లు, ఇద్దరు కాపీయిస్ట్‌లు ఇలా 58 పోస్టుల మంజూరయ్యాయి.