శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 14:00:15

570 ఎమ్మార్వో ఆఫీసుల‌న్నీ స‌బ్ రిజిస్ర్టార్ ఆఫీసులుగా మార్పు

570 ఎమ్మార్వో ఆఫీసుల‌న్నీ స‌బ్ రిజిస్ర్టార్ ఆఫీసులుగా మార్పు

మేడ్చ‌ల్ : ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభంతో రాష్ర్టంలోని 570 ఎమ్మార్వో కార్యాల‌యాన్ని స‌బ్ రిజిస్ర్టార్ కార్యాల‌యాలుగా మారాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. గ‌తంలో మ్యుటేష‌న్ కోసం కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగేవాళ్లం. కార్యాల‌యాల చుట్టు తిరిగే క‌ర్మ ఇక‌పై ఉండ‌దు. రిజిస్ర్టేష‌న్ల కోసం పైర‌వీ చేసే అవ‌కాశం ఉండ‌దు. రైతుల‌కు ఇష్ట‌మున్న రోజు స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు. 

మూడేండ్ల కింద ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టిన‌ప్ప‌డు ఇది సాధ్య‌మైత‌దా? అని అనుకున్నారు. అంద‌రూ ఇబ్బందిప‌డ్డారు. సీఎస్, సీఎంవో కార్య‌ద‌ర్శులు, రెవెన్యూ అధికారులు మూడేళ్లు శ్ర‌మించి ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను రూప‌క‌ల్ప‌న చేశారు. దాదాపు 150 నుంచి 200 స‌మావేశాలు నిర్వ‌హించాం. భూరికార్డుల ప్ర‌క్షాళ‌న చేశాం. ఆ త‌ర్వాత మ‌ధ్యంత‌ర‌ ఎన్నిక‌ల‌కు పోయాం. మ‌ళ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ఆ కార్య‌క్ర‌మాన్ని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా దాన్ని కొన‌సాగించాం అని తెలిపారు. క‌రోనా వ‌ల్ల ఆరేడు నెల‌లు ఈ పోర్ట‌ల్ ఆల‌స్య‌మైంది అని సీఎం కేసీఆర్ చెప్పారు.