ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 20:01:08

జీహెచ్‌ఎంసీ పరిధిలో 56 చెరువులు దెబ్బతిన్నాయి : నీటిపారుదలశాఖ

జీహెచ్‌ఎంసీ పరిధిలో 56 చెరువులు దెబ్బతిన్నాయి : నీటిపారుదలశాఖ

హైదరాబాద్‌ :  వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసన భారీ వర్షానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 56 చెరువులు దెబ్బతిన్నట్లు నీటిపారుదల శాఖ తెలిపింది. మైలార్‌ దేవ్‌పల్లి, గగన్‌పమాడ్‌ అప్పా చెరువు, బలాపూర్‌ గుర్రం చెరువులకు గండ్లు పడినట్లు వెల్లడించింది. ఈ మూడు చెరువుల గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చామని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని 185 చెరువులు పూర్తిగా నిండాయి. చెరువుల పటిష్ఠత, స్థితిగతులను పరిశీలించేందుకు ఇంజినీర్లతో 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు.  ఇంజినీర్ల బృందం అన్ని చెరువుల పటిష్ఠత, స్థితిగతులను పరిశీలించనుంది. వందేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా హైదరాబాద్‌లో ఈ సీజన్‌లో భారీవర్షాలు పడ్డాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.