సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 13:26:57

దుబ్బాక ఉపఎన్నిక‌.. ఒంటి గంట వ‌ర‌కు 55.52% పోలింగ్ న‌మోదు

దుబ్బాక ఉపఎన్నిక‌.. ఒంటి గంట వ‌ర‌కు 55.52% పోలింగ్ న‌మోదు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 55.52 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 34.33 శాతం పోలింగ్ న‌మోదైన విష‌యం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. 

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా ల‌చ్చ‌పేట‌లో రాష్ర్ట ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి శ‌శాంక్ గోయ‌ల్ ప‌ర్య‌టించారు. అక్క‌డ పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సాధార‌ణ ఓట్ల‌కు ఓటేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. చివ‌రి గంట‌లో కొవిడ్ బాధితుల‌కు ఓటేసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. ఇక ఈ ఎన్నిక‌లో 23 మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. వీరి భ‌విత‌వ్యం ఈ నెల 10న తేల‌నుంది.