బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:24

485 కుటుంబాలకు కరోనా కాటు

485 కుటుంబాలకు కరోనా కాటు

  • అత్యధికంగా హైదరాబాద్‌లో 168 కుటుంబాలకు వైరస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కుటుంబాలను కాటేస్తున్నది. ప్రభుత్వం తీసుకున్న అప్రమత్త చర్యలతో వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందనప్పటికీ ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారి ద్వారా సభ్యులకు సోకుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 485 కుటుంబాలు కరోనా బారినపడ్డారు. ఆయా కుటుంబా ల వల్లే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న హైదరాబాద్‌లోనే 168 కుటుంబాలు వైరస్‌ బారినపడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 59 కుటుంబాలు,  మేడ్చల్‌ మల్కాజిగిరి 39,  నిజామాబాద్‌ 30, వరంగల్‌ అర్బన్‌ 26, సూర్యాపేట జిల్లాలో 25 కుటుంబాల్లో కరోనా ప్రభావం చూపించింది. కాగా, శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం పరిధిలో తండ్రి (40), కొడుకు (7)లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు.

దవాఖానల్లో అన్ని రకాల వైద్య సేవలు 

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన కొన్ని వైద్య సేవలను పునరుద్ధరించాలని, ప్రభుత్వ, ప్రైవేట్‌ దవా ఖానల్లో అన్ని రకాల వైద్యసేవలను అందించాల ని వైద్యశాఖ సూచించింది. బోధన, స్పెషాలిటీ దవాఖానల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలతో పాటు అన్ని వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాల ని సూచిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. 

కొత్తగా 55 కేసులు నమోదు

రాష్ట్రంలో శనివారం కొత్తగా 55 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్‌ఎంసీలోనే 44 మంది ఉన్నారు. ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,205కు చేరింది. 

రాష్ట్రంలో కేసుల వివరాలు

వివరాలు
 శనివారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
551,509  
డిశ్చార్జి అయినవారు
12971
మరణాలు
- 34
చికిత్స పొందుతున్నవారు
-504


logo