శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 21:44:59

హరిత రిసార్ట్‌ క్వారంటైన్‌ కేంద్రంలో 53 మంది

హరిత రిసార్ట్‌ క్వారంటైన్‌ కేంద్రంలో 53 మంది

వికారాబాద్  : జిల్లా ప్రజలు భయబ్రాంతులకు గురి కావద్దని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ ప్రభలకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు.  వికారాబాద్‌ జిల్లాలోని  కలెక్టర్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను హరిత రిసార్ట్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తున్నామని, ఇప్పటివరకు 53మందిని తరలించామన్నారు. 

ముందస్తు చర్యల్లో భాగంగా వారిని అతిథులుగా భావించి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, 14 రోజుల పాటు వైద్యులు వారిని పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. అదనంగా  జిల్లాలోని మహవీర్‌ ఆసుపత్రిలో 30 బెడ్లు , తాండూరులో 10 బెడ్లతో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. వికారాబాద్‌ పట్టణం సురక్షితంగా ఉందని వైద్య, పోలీస్‌ శాఖ, జిల్లా యంత్రాంగం అంతా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 


logo