శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 09:28:56

నేటినుంచి 52 ప్రత్యేక రైళ్లు

నేటినుంచి 52 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ : ప్రయాణికుల సంఖ్య పెరిగిన దృష్ట్యా  52 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌- రామేశ్వరం- హైదరాబాద్‌ మధ్య 26 సర్వీసులు, హైదరాబాద్‌- కొచువెలి- హైదరాబాద్‌ మధ్య మరో 26 సర్వీసులు బుధవారం నుంచి మే 29 వరకు నడుస్తాయని రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. హోళీకి ప్రత్యేక రైలు మార్చి 7న  సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి పాట్నాకు చేరుతుందని, మరోరైలు మార్చి 11న  పాట్నా నుంచి ప్రారంభమై 13న అర్ధరాత్రి 12.40 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుందని పేర్కొన్నది.  


logo