గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 04, 2020 , 19:19:43

51 నిమిషాలు..10 కిలోమీటర్లు..నిర్మల్ కలెక్టర్ పరుగు

51 నిమిషాలు..10 కిలోమీటర్లు..నిర్మల్ కలెక్టర్ పరుగు

నిర్మల్‌ టౌన్‌ : నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ప్రతి రోజూ రన్నింగ్‌ చేస్తారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 5 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలు దేరిన ఆయన, తన గన్‌మన్‌ భీంతో కలిసి పరిగెత్తారు. నిర్మల్‌-మంచిర్యాల జాతీయ రహదారిపై 51 నిమిషాల 30 సెకండ్లలో పది కిలోమీటర్లు పరుగెత్తి ఔరా అనిపించారు. మంచిర్యాల చౌరస్తా నుంచి లక్ష్మణ చాంద మండలం కనకాపూర్‌ క్రాస్‌ రోడ్డు వరకు పరుగు కొనసాగించారు.logo